chandrababu: మేం చేస్తోన్న అభివృద్ధిని చూసి టీడీపీలోకి పెద్ద ఎత్తున చేర‌డానికి వ‌చ్చారు: సీఎం చ‌ంద్ర‌బాబు


టీడీపీ ప్ర‌భుత్వం చేస్తోన్న అభివృద్ధిని చూసి పార్టీలోకి చేర‌డానికి పెద్ద ఎత్తున నేత‌లు వ‌చ్చార‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అన్నారు. విజయవాడలో వైసీపీ నేతలను టీడీపీలోకి ఆహ్వానించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్ స్వ‌స్థ‌లం నుంచి నేత‌లు వ‌చ్చి త‌మ‌ పార్టీలో చేర‌డం సంతోష‌క‌రమ‌ని  అన్నారు. టీడీపీలో చేరిన వారంద‌రూ ప్ర‌జ‌ల‌కు ఏ విధంగా సేవ‌లు అందించాలో ఆలోచించి కృషి చేయాల‌ని పిలుపునిచ్చారు.

అనేక సమస్యలతో మన ప్రయాణం ప్రారంభించామ‌ని, రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగిన తరువాత ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి ఎంతో అన్యాయం జ‌రిగింద‌ని చ‌ంద్ర‌బాబు నాయుడు అన్నారు. రాష్ట్రానికి ఆదాయం కూడా లేద‌ని అన్నారు. ఎన్నో స‌మ‌స్య‌లను అంచెలంచెలుగా అధిగ‌మిస్తూ ముందుకు వెళుతున్న‌ట్లు తెలిపారు. పోల‌వ‌రం ప్రాజెక్టును యుద్ధ‌ప్రాతిప‌దిక‌న పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామ‌ని చంద్ర‌బాబు తెలిపారు. నాబార్డు ద్వారా పోలవ‌రం ప్రాజెక్టుకి నిధులు వ‌స్తున్నాయ‌ని తెలిపారు. ఈ నెల 16న ఢిల్లీ వెళ్లి మొద‌టి విడ‌త‌గా రూ.1918 కోట్ల చెక్కును అందుకున్న‌ట్లు తెలిపారు. 2019 నాటికి పోల‌వ‌రం ప్రాజెక్టును పూర్తి చేస్తామ‌ని చెప్పారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News