: వాళ్లు సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టుకోవచ్చా.. మేం దివీస్ పరిశ్రమ పెట్టకూడదా?.. జగన్‌పై ధ్వజమెత్తిన చంద్రబాబు


ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అభివృద్ధికి ఆయన అడుగడుగునా అడ్డుతగులుతున్నారని ఆరోపించారు. ‘‘వాళ్లు సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టుకోవచ్చు కానీ మేం దివీస్ పరిశ్రమ పెట్టకూడదా? వాళ్ల సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే కాలుష్యాన్ని ప్రజలు భరించాలా? పనిచేస్తే అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. అలాగని భయపడితే ఏమీ చేయలేం. ఒక అవినీతిపరుడి పనితీరుకు ఇది ఉదాహరణ’’ అని పరోక్షంగా జగన్‌ను ఉద్దేశించి చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రంలో గ్రోత్ ఇంజిన్‌గా ఉన్న ఆక్వా రంగంలో ఫుడ్ పార్క్ ఏర్పాటు చేస్తుంటే దానికి వ్యతిరేకంగా ప్రతిపక్షం ఆందోళన చేయడం బాధాకరమని చంద్రబాబు అన్నారు. అగ్రిగోల్డ్ బాధితులు ప్రతి గ్రామంలోనూ కనిపిస్తున్నారని, సంస్థ ఆస్తులు వేలం వేసి బాధితులకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.

  • Loading...

More Telugu News