: కేసీఆర్ అపర భగీరథుడు: ‘రసమయి’ బాలకిషన్
సీఎం కేసీఆర్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే ‘రసమయి’ బాలకిషన్ ప్రశంసలు కురిపించారు. తెలంగాణ అసెంబ్లీలో ‘మిషన్ భగీరథ’ పథకంపై నిర్వహించిన స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ పల్లెల్లో నీటి కోసం పడుతున్న ఇబ్బందులకు మిషన్ భగీరథ పథకంతో కేసీఆర్ ముగింపు పలికారని, పల్లెపల్లెకూ మంచినీరు అందిస్తున్న కేసీఆర్ అపర భగీరథుడు అని ప్రశంసించారు. ప్రజలకు మంచి చేయాలన్న కేసీఆర్ సంకల్పానికి ఎవరూ అడ్డుతగలొద్దని ఈ సందర్భంగా బాలకిషన్ కోరారు.