ప్రజల సహనాన్ని పరీక్షించడం సరికాదు!: నోట్ల రద్దుపై ఏపీ బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

నోట్ల రద్దు నిర్ణయంపై ఏపీ బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్టణం శాసనసభ్యుడైన విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ, నోట్ల రద్దు అనంతర పరిణామాలపై తాను కూడా అసహనానికి లోనయ్యానని అన్నారు. గంటలు, రోజులు క్యూలలో నిల్చున్నా అవసరానికి సరిపోయేంత డబ్బులు లేకపోతే ఎవరైనా అసహనానికి గురవుతారని ఆయన చెప్పారు. నోట్ల రద్దు సమస్య తీర్చడానికి ఇన్ని రోజులు తీసుకుంటే ఎవరైనా అసహనానికి గురికావాల్సిందేనని ఆయన తెలిపారు. ప్రజల సహనాన్ని పరీక్షించడం సరికాదని ఆయన హితవు పలికారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నేత ఇలా వ్యాఖ్యానించడం కలకలం రేపుతోంది. 
Go Back to Shorts
vishnukumar raju commented on demonetization

More Telugu News