పరీక్షకు ఎందుకు అటెండ్ కాలేదంటే....గ్యాంగ్ రేప్ చేశారని చెప్పింది!
దీంతో కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, ఆమెను వివరాలు అడగగా, నలుగురు గుర్తుతెలియని ఆగంతుకులు కారులో వచ్చి తనను అడ్డుకుని గన్ పాయింట్ వద్దనున్న మహామాయ ఫ్లైఓవర్ వద్దకు తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేశారని తెలిపింది. దీంతో ఆ పరిసరాల్లో సీసీ టీవీ పుటేజ్ పరిశీలించిన పోలీసులకు అలాంటి ఆనవాళ్లేవీ కనిపించలేదు. ఫ్లైఓవర్ పరిసరాల్లో సీసీటీవీల్లో కూడా ఎలాంటి పుటేజ్ లభ్యం కాలేదు. దీంతో మరింత లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు, ఆమెపై గ్యాంగ్ రేప్ జరగలేదని, పరీక్ష రాయలేదంటే తల్లిదండ్రులేమంటారోనన్న భయంతోనే అలా చెప్పిందని గుర్తించారు. దీంతో ఆమెను మందలించి వదిలేశారు.