Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

యువరాజ్ సింగ్ కు 'తొలి' పుట్టిన రోజు శుభాకాంక్షల వెల్లువ!

టీమిండియా స్టార్ యువరాజ్ సింగ్ 35వ వసంతంలోకి అడుగుపెట్టాడు. అలాంటప్పుడు మొదటి పుట్టినరోజు ఎలా అవుతుందన్న అనుమానం వచ్చిందా? అయితే గౌతమ్ గంభీర్ పెట్టిన ట్వీట్ చూస్తే మీ అనుమానం తీరిపోతుంది. యువీ పుట్టినరోజును పురస్కరించుకుని సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు చెప్పిన గంభీర్...'పెళ్లయిన తరువాత ప్రతి మగవాడకి కొత్త జన్మ ప్రారంభమవుతుంది. ఆ రకంగా ఇది నీకు తొలి పుట్టినరోజు..మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రిన్స్ కి అన్నీ మంచి రోజులే ముందున్నాయి' అంటూ ట్వీట్ చేశాడు. హర్భజన్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా 'తన మరోతల్లికి పుట్టిన సోదరుడు యువరాజ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు' అన్నాడు.

'యువీ లేకుండా టీ20, వన్డే ప్రపంచ కప్ గెలవడం ఊహించగలమా? అతనే అసలైన మ్యాచ్ విన్నర్' అంటూ సర్ జడేజా తెలిపాడు. 'మన స్నేహం విడిపోనిది' అని మహ్మద్ కైఫ్ అంటే, 'భారత్ ఛాంపియన్, పెద్దన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు, నీ నుంచి ఎన్నో నేర్చుకున్నాను. త్వరలోనే నిన్ను కలుసుకుంటాను' అంటూ వర్థమాన క్రికెటర్ హార్డిక్ పాండ్య తెలిపాడు. 'డ్రెస్సింగ్ రూం నుంచి నిండిపోయిన మైదానాలు, జయాలు, అపజయాలు అన్నీ కలిసే చూశామ'ని క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ తెలిపాడు. 'అతను 35వ వసంతంలోకి అడుగుపెట్టాడు. మరి 6 బంతుల్లో అతను కొట్టిన 36 పరుగుల మాటేమిటి?' అంటూ ఐసీసీ అభినందించింది. 
yuvaraj singh birthday

More Telugu News