: 14 ఏళ్ల వయసులో నాపై లైంగికదాడి జరిగింది... మహిళా ఎంపీ సంచలన వ్యాఖ్యలు


తనకు 14 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తనపై లైంగిక దాడి జరిగిందని బ్రిటన్ మహిళా ఎంపీ మిచెల్లీ థామ్సన్ తెలిపారు. ఆ దాడి నుంచి తాను తప్పించుకోలేకపోయానని... ఎంతో భయపడ్డానని... ఆ తర్వాత ఏడుస్తూ ఇంటికి వెళ్లిపోయానని చెప్పారు. ఆ విషయాన్ని తల్లిదండ్రులకు కాని, స్నేహితులకు కాని చెప్పలేదని తెలిపారు. జరిగిన దారుణంపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేదని అన్నారు. తనకు బాగా తెలిసిన వ్యక్తే, మాయమాటలతో నమ్మించి ఈ దారుణానికి ఒడిగట్టాడని చెప్పారు. బ్రిటన్ పార్లమెంటులో ఆమె మాట్లాడుతూ ఈ దారుణం గురించి తెలిపారు. మహిళలపై జరుగుతున్న అరాచకాలను అరికట్టాలని కోరారు. మరో మహిళా ఎంపీ ట్రేసీ బ్రాబిన్ మాట్లాడుతూ, తాను 20 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఓ వ్యక్తి తనపై అత్యాచార యత్నం చేయబోయాడని... అయితే, అదృష్టవశాత్తు తప్పించుకోగలిగానని చెప్పారు.

  • Loading...

More Telugu News