: రాజమహేంద్రవరం నుంచి చెన్నైకి రోజూ విమానం


చెన్నై నుంచి రాజమహేంద్రవరంకి ఇకపై రోజూ విమానం నడపాలని స్పైస్ జెట్ నిర్ణయించింది. రాజమహేంద్రవరం నుంచి హైదరాబాదుకు ప్రయాణికులు ఎక్కువ మంది ఉన్నారని, ఆ తరువాత రాజమహేంద్రవరం నుంచి చెన్నైకి ప్రయాణికులు వెళ్తున్నారని స్పైస్ జెట్ విమానయాన సంస్థ తెలిపింది. దీంతో చెన్నై, రాజమహేంద్రవరం మధ్య ప్రతిరోజూ స్పైస్‌ జెట్‌ విమానం నడపాలని నిర్ణయించినట్టు తెలిపింది. సంస్థ విస్తరణ కార్యకలాపాల్లో భాగంగా చెన్నై- రాజమహేంద్రవరం విమానం డిసెంబర్ 15 నుంచి ప్రతిరోజూ అందుబాటులో ఉంటుందని స్పైస్ జెట్ సంస్థ తెలిపింది. టికెట్టు ధర 2,499 రూపాయల నుంచి ప్రారంభమవుతుందని స్పైస్ జెట్ వెల్లడించింది. ప్రతిరోజూ మధ్యాహ్నం చెన్నైలో 1.10 నిమిషాలకు టేకాఫ్ తీసుకుని, 2.30 నిమిషాలకు రాజమహేంద్రవరంలో ల్యాండ్ అవుతుందని, అలాగే 3 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 4:15 నిమిషాలకు చెన్నైలో ల్యాండ్ అవుతుందని స్పైస్ జెట్ ప్రకటించింది.

  • Loading...

More Telugu News