‘అమ్మ’కు గులాబీలు అంటే ఎంతో ఇష్టమట!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

‘అమ్మ’కు గులాబీలు అంటే ఎంతో ఇష్టమట!

‘అమ్మ’ జయలలితకు గులాబీ పూలు అంటే ఎంతో ఇష్టమట. ముఖ్యంగా గులాబీ పూల బొకేలపై ఆమె ఎనలేని మక్కువ చూపించేవారని ఆమె సన్నిహితులు చెబుతుంటారు. ఎంతగా ఇష్టమంటే.. ఆ పుష్పగుఛ్చాలను చూసి చిన్నపిల్లలా ఆమె సంతోషపడిపోయేవారట. అంతేకాదు, ఆకుపచ్చ రంగు, 2,5,6,9 సంఖ్యలు తనకు బాగా కలిసొచ్చేవని జయలలిత నమ్మేవారట. అందుకే, ఎక్కువగా ఆకుపచ్చ రంగు చీరలోనే ఆమె ఎక్కువగా కనిపించేవారని చెబుతుంటారు. ఏదైనా ఒక పని చేయాలంటే మంచి ముహూర్తం చూసుకున్న తర్వాతే జయలలిత దానిని ప్రారంభించేవారని ‘అమ్మ’ సన్నిహితులు చెబుతుంటారు.

More Telugu News