: హైదరాబాద్ లోని ఫామ్ హౌస్ అంటే ‘అమ్మ’కు ఎంతో ఇష్టమట!
సినీ నటిగా, సీఎంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న జయలలితకు హైదరాబాద్ నగరంతో అనుబంధం ఎక్కువే. ముఖ్యంగా జీడిమెట్లలో 18 ఎకరాల్లో నిర్మించుకున్న ఫామ్ హౌస్ అంటే ‘అమ్మ’కు ఎంతో ఇష్టమని సంబంధిత వర్గాల సమాచారం. పక్కా భద్రతతో నిర్మించిన ఈ ఫామ్ హౌస్ లోకి జయలలిత ఎంపిక చేసిన తమిళ కుటుంబాలు మినహా ఎవరికి పడితే వారికి అనుమతి లభించేది కాదు. ఫామ్ హౌస్ లో నివసించే వారు కనీసం తమ నిత్యావసరాల కోసం కూడా బయటకు వచ్చిన దాఖలాలు లేవని స్థానికుల సమాచారం.