: జయలలిత త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా: రాహుల్ గాంధీ
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత త్వరగా కోలుకోవాలని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆకాంక్షించారు. అంతా ఆశావహంగా ఉండాలని కోరుకుంటున్నానని, ఆమెకు నిపుణులైన వైద్యులు చికిత్స అందిస్తున్నారని, అద్భుతం జరుగుతుందని ఆశిస్తున్నానని ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ చెప్పారు. అపోలో, ఎయిమ్స్, విదేశాలకు చెందిన వైద్య నిపుణులు ఆమెను జాగ్రత్తగా కాపాడుతారని భావిస్తున్నానని తెలిపారు. అభిమానులంతా కలిసి ప్రార్థనలు చేయాలని, ఆయన సూచించారు. అంతా మంచే జరుగుతుందని ఆయన అన్నారు.