: దుర్గమ్మ దర్శనానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. ఇద్దరు శ్రీకాకుళంవాసుల దుర్మరణం
బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని తల్లిని తనివితీరా చూడాలనుకున్న వారి కోరిక ఫలించలేదు. విజయవాడ చేరుకోకముందే వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. పోలీసుల వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం పనసలోవ గ్రామానికి చెందిన ఓ కుటుంబం కారులో కనకదుర్గమ్మ దర్శనం కోసం విజయవాడ బయలుదేరింది. వారు ప్రయాణిస్తున్న కారు తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలోని దివాన్‌చెరువు వద్ద ప్రమాదానికి గురైంది. రోడ్డుపై ఆగి ఉన్న కంటెయినర్‌ను కారు వేగంగా వెళ్లి ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో తొమ్మదిమందికి గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను వెంటనే కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.