: కేంద్ర మంత్రి జైట్లీకి సవాల్ విసిరిన పంజాబ్ కాంగ్రెస్ నేత


కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీకి పంజాబ్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ అమరీందర్ సింగ్ సవాల్ విసిరారు. బీజేపీకి ప్రజలు సానుకూలంగా ఉన్నారో లేక వ్యతిరేకంగా ఉన్నారో తెలియాలంటే జైట్లీ తన పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయాలని అన్నారు. అమృత్ సర్ నుంచి పోటీ చేసి జైట్లీ తన సత్తా చాటాలని అమరీందర్ సింగ్ సవాల్ విసిరారు. కాగా, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే నిమిత్తం అమరీందర్ సింగ్ తన ఎంపీ పదవికి ఇటీవలే రాజీనామా చేశారు. గత లోక్ సభ ఎన్నికల్లో అమృత్ సర్ నుంచి అమరీందర్ సింగ్ పై పోటీ చేసిన జైట్లీ ఓటమి పాలవడం, ఆ తర్వాత ఆయన్ని రాజ్యసభకు బీజేపీ ఎంపిక చేయడం విదితమే.

  • Loading...

More Telugu News