: బీజేపీలో చేరిన బాలీవుడ్ సీనియర్ నటి హిమానీ శివపురి
వెటరన్ బాలీవుడ్ నటి హిమానీ భట్ శివపురి బీజేపీలో చేరింది. డెహ్రాడూన్ లో జరిగిన బీజేపీ పార్టీ కార్యక్రమంలో ఉత్తరాఖండ్ బీజేపీ ఉపాధ్యక్షుడు జ్యోతి ప్రసాద్ గైరోలా ఆమెకు కండువా అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పార్టీ ఏ బాధ్యత అప్పగించినా నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఉత్తరాఖండ్ కు చెందిన హిమానీ 1984లో వచ్చిన అబ్ ఆయేగా మజా సినిమాతో బాలీవుడ్ లో అరంగేట్రం చేశారు. తరువాత 'రాజా', 'పరదేశ్', 'హీరో నంబర్ వన్', 'కోయలా', 'బంధన్', 'దీవానా మస్తానా', 'దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే', 'ఉమ్రావ్ జాన్' వంటి సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు.