: మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్


టీమిండియా-ఇంగ్లండ్ జట్ల మధ్య మొహాలీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు నాలుగు రోజుల్లోనే ముగిసేలా కనిపిస్తోంది. టీమిండియా ఆధిక్యాన్ని తగ్గించాలన్న లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ ను రవిచంద్రన్ అశ్విన్ ఆదిలోనే దెబ్బతీశాడు. కుక్ (12), మొయిన్ అలీ (5)లను పెవిలియన్ కు పంపి టీమిండియాకు విజయావకాశాలను పెంచాడు. అనంతరం జయంత్ యాదవ్ మరో చక్కని బంతితో బెయిర్ స్టో (15) ను పెవిలియన్ కు పంపాడు. దీంతో మూడు వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లండ్ ఇంకా 59 పరుగులు వెనుకబడి ఉంది. టీమిండియా బౌలర్లలో అశ్విన్ రెండు, జయంత్ యాదవ్ ఒక వికెట్ తీశారు.

  • Loading...

More Telugu News