: గుడ్ న్యూస్... మార్చి 2017 వరకు ఫ్రీ ఆఫర్ ను పొడిగించనున్న జియో!
తన ఉచిత ఆఫర్లతో భారత టెలికం రంగంలో పెను తుపానునే కలిగించిన రిలయన్స్ జియో, ఆఫర్లను మరింతకాలం పాటు అందించాలని నిర్ణయించింది. తొలుత డిసెంబర్ 31 వరకూ ఉచిత డేటా, వాయిస్, వీడియో కాల్స్ అందించాలని నిర్ణయించిన జియో, ఇప్పుడా ఆఫర్ ను మార్చి 2017 వరకూ అందించాలని భావిస్తోంది. ఈ విషయమై అధికారిక ప్రకటన డిసెంబర్ 28న రానున్నట్టు తెలుస్తోంది. ఉచిత ఆఫర్ తరువాత జియో వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరిగినప్పటికీ, అనుకున్న స్థాయిలో కస్టమర్లు రాకపోవడంతోనే ఆఫర్ ను పొడిగించాలని జియో అధినేత ముఖేష్ అంబానీ భావిస్తున్నట్టు సమాచారం. కాగా, జియో ఆఫర్లలో భాగంగా 1 జీబీ డేటా రూ. 50కే లభిస్తుందన్న సంగతి తెలిసిందే.