: సత్తాచాటిన సింధు...టైటిల్ వేటకు అడుగు దూరం
తెలుగు తేజం బ్యాడ్మింటన్ స్టార్ పీవీ.సింధు మరో టైటిల్ వేటలో దూసుకుపోతోంది. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టైటిల్ సాధించి జోరుమీదున్న సింధు హాంగ్ కాంగ్ ఓపెన్ సిరీస్ ఫైనల్ కు చేరింది. క్వార్టర్ ఫైనల్ లో సైనా నెహ్వాల్ పై విజయం సాధించి సెమీఫైనల్ చేరిన 'చుంగ్ గాన్ యి'పై 21-14, 21-16 తేడాతో విజయం సాధించింది. వరల్డ్ 9వ ర్యాంకు సాధించిన సింధు ఈ విజయంతో ఉత్సాహం పుంజుకుంది. కెరీర్ లో అత్యుత్తమ ఫాంలో ఉన్న సింధు మరోటైటిల్ సాధించేందుకు అడుగు దూరంలో ఉంది.