: రూ. 20 వేల లంచం తీసుకుంటూ దొరికిపోయాడు.... అన్నీ కొత్త నోట్లే


అవినీతికి వ్యతిరేకంగా ఓ వైపు కేంద్ర ప్రభుత్వం పోరాడుతుంటే... లంచావతారులు మాత్రం మరోవైపు రెచ్చిపోతున్నారు. పాత నోట్లు రద్దైనా అవినీతిపరులు మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. తాజాగా, చిత్తూరు జిల్లా నీటిపారుదల శాఖలో డిప్యూటీ ఇంజినీర్ గా పనిచేస్తున్న సత్యనారాయణ లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కయ్యాడు. ఓ కాంట్రాక్ట్ నిమిత్తం బాబునాయుడు అనే వ్యక్తి వద్ద నుంచి ఆయన రూ. 20 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ముందస్తు సమాచారంతో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించగా సత్యనారాయణ పట్టుబడ్డారు. మరోవిషయం ఏమిటంటే, లంచం రూపంలో సత్యనారాయణ తీసుకుంటున్నవన్నీ కొత్త నోట్లే.

  • Loading...

More Telugu News