: చంద్రబాబు లాంటి సీనియర్ల సలహా తీసుకోవాల్సింది: మంత్రి ప్రత్తిపాటి


పెద్దనోట్ల రద్దు అనంతరం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, ఈ విషయమై చంద్రబాబు లాంటి సీనియర్ల సలహా తీసుకుని ఉంటే బాగుండేదని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అభిప్రాయపడ్డారు. విజయవాడలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, పెద్దనోట్ల రద్దుపై వైఎస్సార్సీపీ అధినేత జగన్, ఆ పార్టీ నేతల స్పందన కరువైందన్నారు. బంకర్లలో దాచుకున్న నల్ల డబ్బు చెల్లదనే దిగులుతో జగన్ కు జ్వరం వచ్చిందని ప్రత్తిపాటి ఆరోపించారు.

  • Loading...

More Telugu News