: ప్రతి రోజూ నొప్పులతో బాధపడుతున్నా!: పాప్ సింగర్ లేడీ గాగా
తన పాప్ గీతాలతో జనాలను ఉర్రూతలూగించే ప్రముఖ పాప్ స్టార్ లేడీ గాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ విషయాన్ని బయటపెట్టింది. గత కొంత కాలంగా తాను దీర్ఘకాలిక నొప్పితో బాధ పడుతున్నానని ఆమె తెలిపింది. ప్రతి రోజూ నొప్పిని అనుభవిస్తున్నానని... అయితే ఎంతో అనుభవం ఉన్న మహిళా వైద్యులు తన చుట్టూ ఉండటం వల్ల సంతోషంగానే ఉన్నానని చెప్పింది. ఈ విషయాన్ని ఇన్ స్టాగ్రాం ద్వారా గాగా తెలిపింది. ఎంతో ఎనర్జిటిక్ గా కనిపించే లేడీ గాగా... దీర్ఘకాలిక నొప్పితో బాధపడుతుండటం ఆమె అభిమానులను బాధించే అంశమే. ప్రస్తుతం ఆమె జోన్నే అనే ఆల్బంను తయారు చేసే పనిలో బిజీగా ఉంది.