: నేనో బిచ్చగత్తెను.. పెద్దనోట్ల రద్దుపై మాట్లాడే అర్హత నాకు లేదు: బాలీవుడ్ నటి వాణీకపూర్
పెద్దనోట్ల రద్దుపై తమ అభిప్రాయం చెప్పమంటే బాలీవుడ్ నటులు రణ్ వీర్ సింగ్, వాణీ కపూర్ చెప్పిన సమాధానాలు వింటే ఆశ్చర్యపోతారు. వీరిద్దరూ జంటగా నటించిన ‘బేఫికర్’ చిత్ర ప్రచార కార్యక్రమంలో ఈ జంట పాల్గొంది. ఈ సందర్భంగా పెద్దనోట్ల రద్దుపై తమ అభిప్రాయం చెప్పాలని మీడియా ప్రశ్నించగా ..‘నేనో బిచ్చగత్తెను. నా దగ్గర డబ్బుల్లేవు. పెద్దనోట్ల రద్దుపై మాట్లాడే అర్హత నాకు లేదు’ అని వాణీ కపూర్, ‘నేను బేఫికర్. నాకు లెక్కలు రావు. ఎకనామిక్స్ గురించి తెలియదు. పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మాట్లాడే అర్హత నాకు లేదు’ అని రణ్ వీర్ సింగ్ సమాధానమిచ్చారు.