: బ్యాంకులకు ఒకే రోజు వెళ్లాల్సిన అవ‌స‌రం లేదు.. సూచ‌న‌లివే!: ఐబీఏ


ప్ర‌జ‌లు పాత‌నోట్ల మార్పిడి, డిపాజిట్ల కోసం బ్యాంకులకు ఒకే రోజు వెళ్లాల్సిన అవ‌స‌రం లేదని, వచ్చేనెల 31వ తేదీ వ‌ర‌కు స‌మ‌యం ఉంద‌ని ఇండియ‌న్ బ్యాంక‌ర్స్ అసోసియేష‌న్ అధికారులు ఈ రోజు మీడియాకు తెలిపారు. ప్ర‌జ‌లు ఎటువంటి గంద‌ర‌గోళానికి గురి కావాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్పారు. ప్ర‌జ‌లు ప‌రిమితంగా న‌గ‌దు తీసుకునేందుకు ఆర్‌బీఐ త‌మ‌కు ప‌లు సూచ‌న‌లు ఇచ్చిందని పేర్కొన్నారు. బ్యాంకుల్లో ప్ర‌జ‌లు రూ.4 వేల వ‌ర‌కు మార్పిడి చేసుకోవ‌చ్చని పేర్కొన్నారు. ఆన్‌లైన్ చెక్కుల రూపంలో ఖాతాల నుంచి బ‌దిలీకి ఎలాంటి ప‌రిమితి లేదని స్ప‌ష్టం చేశారు. అలాగే, ప్ర‌జ‌లు త‌మ వ‌ద్ద ఉన్న‌ పాత నోట్ల‌ను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవ‌డానికి కూడా ఎలాంటి ప‌రిమ‌తి లేదని చెప్పారు. ఆర్‌బీఐ సూచ‌న‌ల ప్రకారం ఈ నెల 18 వ‌ర‌కు ఏటీఎం నుంచి రోజుకు రూ.2 వేల చొప్పున, 18వ తేదీ త‌రువాత నుంచి రూ.4 వేలు చొప్పున తీసుకోవ‌చ్చని చెప్పారు. వ‌చ్చే శ‌ని, ఆదివారాల్లోనూ దేశంలోని అన్ని బ్యాంకులు ప‌నిచేస్తాయని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News