: 16 నుంచి కాపు సత్యాగ్రహ యాత్ర
ఈ నెల 16 నుంచి కాపు సత్యాగ్రహ యాత్రను నిర్వహించనున్నట్లు కాపు జేఏసీ నేతలు వెల్లడించారు. ఈరోజు రాజమహేంద్రవరంలో విలేకరులతో మాట్లాడుతూ, కాపు రిజర్వేషన్లపై అవగాహన కోసమే ఈ సత్యాగ్రహ యాత్రను చేపట్టనున్నట్లు చెప్పారు. ఈ యాత్రలో కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పాల్గొంటారని అన్నారు. కాపు సత్యాగ్రహ యాత్రను శాంతియుతంగా నిర్వహిస్తామని, ఒకవేళ ఏదైనా జరిగితే తమదే బాధ్యత అని జేఏసీ నేతలు ఏసుదాసు, రామకృష్ణ పేర్కొన్నారు.