: తన బైక్ ఎక్కాలంటూ రోడ్డుపై వేధించిన యువకుడు.. చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పిన యువతి


గుంటూరు జిల్లా సత్తెనపల్లి రైల్వేస్టేషన్ ప్రాంతంలో ఓ యువ‌కుడు బైక్ పై తిరుగుతూ యువ‌తుల‌ను వేధిస్తున్నాడు. రోడ్డు ప‌క్క‌న క‌నిపిస్తోన్న‌ ఒంట‌రి మ‌హిళ‌లు, యువ‌తుల‌ ప‌ట్ల అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తిస్తూ రెచ్చిపోతున్నాడు. వారి వ‌ద్ద‌కు వెళ్లి త‌న‌ బైక్ ఎక్కాలంటూ యువ‌తుల‌ వెంట‌ప‌డుతున్నాడు. రోజూలాగే ఈ రోజు కూడా ఆ యువ‌కుడు ఓ యువ‌తిని త‌న బైకు ఎక్కాల‌ని కోరాడు. స్థానికుల సాయంతో ఆ యువ‌కుడిని ప‌ట్టుకున్న స‌ద‌రు యువ‌తి అంద‌రి ముందు చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పింది. స్థానికులు కూడా యువ‌కుడికి దేహశుద్ధి చేసి వ‌దిలేశారు.

  • Loading...

More Telugu News