: తమిళనాడులో భారీ సంఖ్యలో నకిలీ వైద్యులను అదుపులోకి తీసుకున్న పోలీసులు


తమిళనాడులో నకిలీ వైద్యులు విపరీతంగా పెరిగిపోయారు. మెడికల్ కోర్సులు చదవకుండానే డాక్టర్లమని చెప్పుకుంటూ రోగులకు వైద్యం చేసేస్తున్నారు. ఈ విష‌యంపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్న అధికారులు భారీ సంఖ్య‌లో న‌కిలీ వైద్యుల‌ను అరెస్టు చేశారు. ఈ అంశంపై రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ సి.విజయ్‌ భాస్కర్ మాట్లాడుతూ... ఇప్పటికి 640 మంది నకిలీ డాక్టర్లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నకిలీ వైద్యులకు సంబంధించి ప్ర‌జ‌ల‌కు ఏదైనా స‌మాచారం తెలిస్తే వెంట‌నే త‌మ‌కు తెలపాల‌ని ఆయ‌న కోరారు. ఈ కేసులు పెరిగిపోతున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

  • Loading...

More Telugu News