: అక్కినేని అభిమానులకు శుభవార్త.. అఖిల్ ఎంగేజ్ మెంట్ డేట్ ఫిక్సయింది
అక్కినేని అభిమానులకు శుభవార్త. నాగార్జున, అమల పుత్రుడు, యువహీరో అఖిల్ అక్కినేని, ఫ్యాషన్ డిజైనర్ శ్రియా భూపాల్ ఎంగేజ్ మెంట్ డేట్ ఫిక్సయింది. ఇందుకు సంబంధించిన ఎంగేజ్ మెంట్ కార్డు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తోంది. హైదరాబాద్ లోని జీవీకే హౌస్ లో డిసెంబర్ 9వ తేదీ శుక్రవారం సాయంత్రం 7 గంటలకు ఈ వేడుక జరగనున్నట్లు ఎంగేజ్ మెంట్ కార్డులో పేర్కొన్నారు. కాగా, అఖిల్, శ్రియాభూపాల్ ప్రేమ వ్యవహారం కొన్నేళ్లుగా సాగుతోంది. తమ ప్రేమ విషయాన్ని వారి తల్లిదండ్రులకు చెప్పడం, అందుకు వారు అంగీకరించడం తెలిసిందే. ఇక, సినీ ప్రేమ జంట నాగ చైతన్య, సమంతల వివాహం ఎప్పుడు జరుగుతుందా అని కూడా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అఖిల్ వివాహమైన తర్వాతే తమ పెళ్లి ఉంటుందని నాగచైతన్య గతంలో ప్రకటించడం తెలిసిందే.