: పాకిస్థాన్ బ‌ల‌గాల కాల్పుల్లో ఏడుకి చేరిన మృతుల సంఖ్య.. మరో 20 మందికి తీవ్రగాయాలు


జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ కాల్పులు జరుపుతున్న పాకిస్థాన్ రేంజర్ల చర్యలు కొనసాగుతున్నాయి. పాకిస్థాన్ రేంజర్లు ఈ రోజు ఉద‌యం నుంచి కాల్పుల‌తో విరుచుకుప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. సరిహద్దు ప్రాంతాల్లో జవాన్లతో పాటు పౌరులు లక్ష్యంగా కూడా వారు కాల్పులు జ‌రుపుతున్నారు. రాజౌరీ, ఆర్నియా, నౌషీరా, రామ్‌గ‌ఢ్‌ సెక్టార్లలో ఈ కాల్పులు జ‌రుగుతున్నాయి. ఈ కాల్పుల్లో మృతుల సంఖ్య ఏడుకి పెరిగింది. వారిలో నలుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మరో 20మంది పౌరులు తీవ్ర గాయాల‌పాల‌య్యారు. సరిహద్దుల్లో పాకిస్థాన్ నుంచి ఉగ్రవాదులు చొరబడేందుకు ప్ర‌యత్నిస్తుంటే అందుకు పాక్ ఆర్మీ సాయపడుతున్నట్లు తెలుస్తోంది. భార‌త సైన్యం పీవోకేలో జ‌రిపిన ల‌క్షిత దాడుల త‌రువాత పాక్ రేంజ‌ర్లు ఇప్ప‌టికీ దాదాపు 60 సార్లు కాల్పుల ఉల్లంఘనకు పాల్పడ్డారు. ఇప్పటివరకూ మొత్తం 15మంది మరణించగా, మ‌రో 40మంది గాయాల‌పాల‌య్యారు.

  • Loading...

More Telugu News