: మైఖేల్ జాక్సన్ సాంగ్ కు స్టెప్పులేసిన ఒబామా దంపతులు
మైఖేల్ జాక్సన్ సాంగ్ కు అమెరికా అధ్యక్షుడు ఒబామా, ఆయన భార్య మిచెల్ స్టెప్పులేశారు. వైట్ హౌస్ లో జరిగిన తన చివరి హాలోవీన్ ట్రిక్ (ట్రీటింగ్ సెర్మనీ)లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సుమారు నాలుగు వేల మందిని ఆహ్వానించారు. హాజరైన వారిలో అధిక శాతం ఎలిమెంటరీ పాఠశాలలకు చెందిన విద్యార్థులు, మిలిటరీ కుటుంబాలు ఉన్నాయి. ఈ సందర్భంగా మైఖేల్ జాక్సన్ ‘థ్రిల్లర్’ సాంగ్ కు ఒబామా దంపతులు స్టెప్పులేశారు.