: ఇండియా ఓడిపోయి వుంటే ధోనీ కెప్టెన్సీకే ఎసరొచ్చేది: సౌరవ్ గంగూలీ


నిన్నటి విశాఖపట్నం వన్డేలో న్యూజిలాండ్ చేతిలో భారత జట్టు ఓటమి పాలైవుంటే మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్ పదవికి ఎసరు తెచ్చేదని, కెరీర్ పైనే ప్రభావం చూపేదని మాజీ కెప్టెన్, బెంగాల్ దాదా సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. ఈ గెలుపు ధోనీకి అతి ముఖ్యమైనదని, ఇండియా సిరీస్ గెలవడంతో ధోనీ ముందుకు రావాల్సిన ఎన్నో ప్రశ్నలు పక్కకెళ్లి పోయాయని తెలిపాడు. కీలకమైన మ్యాచ్ లో తిరిగి పుంజుకోవడం, తనను తాను నిరూపించుకోవాల్సిన సందర్భంలో దక్కిన విజయంతో ధోనీ ఎంతో ఊరట చెంది వుంటాడని అన్నాడు. విజయం సాధించడానికి ఇండియాకు అన్ని అర్హతలూ ఉన్నాయని తెలిపాడు.

  • Loading...

More Telugu News