: జట్టు కూర్పు బాగుంది... ఓపెనర్ గా రహానేని పంపుతున్నాం!: కుంబ్లే


ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో రేపు జరగనున్న రెండో వన్డేలో న్యూజిలాండ్ పై విజయమే లక్ష్యంగా భారత్ బరిలోకి దిగుతుందని టీమిండియా చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, పెద్దపెద్ద ప్రణాళికలు వేసుకుని గందరగోళానికి గురవ్వాలని భావించడం లేదని అన్నారు. తొలి వన్డేలోని జట్టును అలాగే కొనసాగించాలని భావిస్తున్నామని ఆయన చెప్పారు. రహానే టాప్ ఆర్డర్ ప్లేయర్ అయినప్పటికీ ఈ సిరీస్ లో ఆయనను ఓపెనర్ గా పంపాలని నిర్ణయించామని కుంబ్లే చెప్పారు. హార్డిక్ పాండ్యా తొలి వన్డేలో రాణించడం భారత్ కు అడ్వాంటేజ్ అని ఆయన తెలిపారు. ప్రస్తుతం టీమిండియాకు అన్నీ అనుకూలంగా ఉన్నాయని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News