: సాగునీటి ప్రాజెక్టులు, బాహుబలి గ్రాఫిక్స్ ఒకటే: వైకాపా
ఏపీ సీఎం చంద్రబాబు చూపిస్తున్న సాగునీటి ప్రాజెక్టుల డిజైన్లు బాహుబలి చిత్రం గ్రాఫిక్స్ లా ఉన్నాయని వైకాపా ఆరోపించింది. ప్రాజెక్టులకు ప్రచారం చేసుకునేందుకు చంద్రబాబు క్వాలిటీతో కూడిన గ్రాఫిక్స్ చేయించారని, వీటిని నమ్మే స్థితిలో ప్రజలు లేరని వైకాపా నేత కురసాల కన్నబాబు విమర్శించారు. ఈ ఉదయం రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడిన ఆయన, తూర్పు గోదావరి జిల్లాలో ఎన్నో ఎత్తిపోతల పథకాలు రైతులకు ఉపయోగపడటం లేదని, వాటి గురించి పట్టించుకోకుండా పురుషోత్తమపట్నం పథకం పేరిట ప్రజలను వంచిస్తున్నారని ఆరోపించారు. ఒకేసారి రూ. 1,638 కోట్లు విడుదల చేయడం వెనుక కమీషన్ల కక్కుర్తి దాగుందని విమర్శించారు. ఈ ప్రాజెక్టుల డిజైన్లు ఎకరా భూమిని కూడా తడపలేవని కన్నబాబు చంద్రబాబు వైఖరిని ఎండగట్టారు.