: ట్రంప్ లాంటి వాళ్లకు షాపింగ్ మాల్స్ లో కూడా ఉద్యోగమివ్వరు: ఒబామా ఫైర్
డొనాల్డ్ ట్రంప్ పై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా విరుచుకుపడ్డారు. మహిళలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఘోరంగా ఉన్నాయని విమర్శించారు. రిపబ్లికన్ పార్టీలో ఉన్న సీనియర్లు ట్రంప్ కు మద్దతు ఇవ్వడం మానుకోవాలని సూచించారు. "ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే... షాపింగ్ మాల్స్ లో కూడా అలాంటి వ్యక్తులకు ఉద్యోగాలు ఇవ్వరు" అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరోపైపు, రిపబ్లికన్ పార్టీ తరపున స్పీకర్ పదవికి పోటీ పడుతున్న పాల్ ర్యాన్ కూడా ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేశారు. దీనిపై ట్రంప్ స్పందనను కోరగా...అతని అవసరం తనకు లేదని కొట్టి పారేశారు.