: ఇండియన్ ఆర్మీతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది!: లాలూ ప్రసాద్ యాదవ్


ఇండియన్ ఆర్మీతో పెట్టుకుంటే ఫలితం ఇలాగే ఉంటుందని పాకిస్థాన్ ను ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ హెచ్చరించారు. పాట్నాలో ఆయన మాట్లాడుతూ, పీవోకే లో సర్జికల్ స్ట్రయిక్స్ చేపట్టిన భారత సైనికులకు ఆయన అభినందనలు తెలిపారు. సర్జికల్ స్ట్రయిక్స్ ను రాజకీయం చేసి తద్వారా లబ్ధి పొందాలని బీజేపీ చూస్తోందని ఆయన విమర్శించారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ తో తమకు ఎలాంటి విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు. అన్నదమ్ముల్లాంటి తమ మధ్య విభేదాలు సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.

  • Loading...

More Telugu News