: సల్మాన్ 'ట్యూబ్ లైట్' పాట రిహార్సల్ వీడియో లీకైంది!
ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కొత్త సినిమా 'ట్యూబ్ లైట్'లోని పాట సీన్ ఆన్ లైన్ లో లీకై హల్ చల్ చేస్తోంది. ‘భజరంగీ భాయ్ జాన్’ సినిమా టీం ఆధ్వర్యంలో రూపొందుతున్న సల్మాన్ ఖాన్ ‘ట్యూబ్ లైట్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ నేపాల్ లో జరుగుతోంది. ఈ సినిమాలో ఓ పాటకు సంబంధించిన వీడియో వీడియో తాజాగా లీకైంది. కొరియోగ్రాఫర్ సారధ్యంలో పాటకు డాన్స్ రిహార్సల్స్ చేస్తున్న సన్నివేశాలకు చెందిన వీడియో లీకైంది. దీంతో ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కాకుండానే సల్మాన్ లుక్ తెలిసిపోయింది. స్వెర్టర్ వేసుకున్న సల్మాన్ తో పాటు అదేరీతిలో తయారైన చిత్రబృందం కూడా డ్యాన్స్ చేస్తోంది. గతంలో 'సుల్తాన్' సినిమా ఆన్ లైన్ లో లీకైనప్పటికీ... కలెక్షన్లలో దాని ప్రభావం పడకపోవడం విశేషం. ఈ సినిమాలో సల్మాన్ జోడీగా చైనీస్ నటి చూచూ నటిస్తోంది.