: షరీఫ్‌కు పాలనాదక్షత లేదు.. మోదీని ఎలా ఎదుర్కోవాలో ఆయనకు నేను చెబుతా: ఇమ్రాన్ ఖాన్
ప్రధాని నవాజ్ షరీఫ్‌కు పాలనా దక్షత లేదని, భారత్ సర్జికల్ స్ట్రయిక్స్‌పై ఎలా స్పందించాలో ఆయనకు తాను చెబుతానని పాక్ మాజీ క్రికెటర్, తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) చీఫ్ ఇమ్రాన్‌ఖాన్ అన్నారు. ఇటువంటి దాడులు జరిగినప్పుడు ఎలా స్పందించాలో తనకు తెలుసునని ఈరోజు (శుక్రవారం) పంజాబ్ ప్రావిన్స్‌లో నిర్వహించనున్న మార్చ్‌లో ఆ విషయాన్ని చెబుతానని ఆయన పేర్కొన్నారు. నవాజ్ షరీఫ్‌కు ప్రాథమికంగా ఓ సందేశం ఇవ్వాలనుకుంటున్నట్టు చెప్పిన ఇమ్రాన్ భారత ప్రధాని నరేంద్రమోదీకి కూడా శుక్రవారం ఓ సందేశం పంపిస్తానన్నారు. తాను చేపట్టబోయే మార్చ్‌లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఐక్యత చూపాలని కోరారు. మరోవైపు షరీఫ్‌పై విరుచుకుపడిన ఇమ్రాన్‌ఖాన్ ఆయనకు పాలనా దక్షత లేదని విమర్శించారు. ప్రస్తుతం పాకిస్థాన్‌కు ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారంటూ ధ్వజమెత్తారు.