: కత్రినా, రణ్‌బీర్‌తో కలిసి లిఫ్ట్‌లో వెళ్తూ ఇరుక్కుపోయే సందర్భం వస్తే చచ్చిపోతా: కరీనా కపూర్
మాజీ ప్రేమికులు రణ్‌బీర్ కపూర్, కత్రినా కైఫ్‌ల మధ్య ప్రస్తుతం మాటల్లేవన్న విషయం తెలిసిందే. పది నెలల క్రితం విడిపోయిన వీరు ప్రస్తుతం ఎవరి పనిలో వారు బిజీగా గడిపేస్తున్నారు. వీరు ఏ కారణం వల్ల బ్రేకప్ అయ్యారన్న విషయాన్ని మాత్రం ఇంతవరకు వారు చెప్పలేదు. వీరిరువురి గురించి పుకార్లు మాత్రం వస్తూనే ఉన్నాయి. వీరిద్దరి మధ్య ఏం జరిగిందో తనకు కూడా తెలియదని తాజాగా రణ్‌బీర్ సోదరి కరీనా కపూర్ తెలిపింది. వోగ్ బీఎఫ్‌ఎఫ్ చాట్‌లో పాల్గొన్న కరీనాను ‘ఒకవేళ మీరు కత్రినా, రణ్‌బీర్‌తో కలిసి లిఫ్ట్‌లో వెళ్తూ ఇరుక్కుపోతే ఏం చేస్తారు?’ అని ప్రశ్నించారు. దానికి కరీనా సమాధానం ఇస్తూ అదే జరిగితే తన ప్రాణం తాను తీసుకుంటానని చెప్పింది. రణ్‌బీర్, కత్రినాలు ప్రేమికులుగా ఉన్న సమయంలో కరీనా, కత్రినాలు మంచి స్నేహితులుగా ఉండేవారు. ఆ సమయంలో కరణ్ జొహార్ టీవీ షో ‘కాఫీ విత్ కరణ్’కి కరీనా, రణ్‌బీర్ పాల్గొన్నారు. ఆ సమయంలో షోలో కత్రినాని తన మరదలు అని సంబోధిస్తూ రణ్‌బీర్‌ని కరీనా ఆటపట్టించింది. కానీ, ఇప్పుడు తన సోదరుడు కత్రినాతో కటీఫ్ కావడంతో తాను కూడా కత్రినాతో సరిగా మాట్లాడడం లేనని కరీనా చెప్పింది.