: కాకినాడ సభలో గాయపడ్డ పవన్ అభిమానికి ఆర్థిక సాయం


జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల కాకినాడలో నిర్వహించిన ఆత్మగౌరవన సభలో గాయపడ్డ అభిమాని కురసాల సుబ్రహ్మణ్యంకు ఆర్థిక సాయం అందింది. పవన్ కల్యాణ్ అభిమానులు రూ.20 వేలను ఆయనకు అందజేశారు. రామచంద్రపురం మండలం వెల్లసావరానికి చెందిన సుబ్రహ్మణ్యం సభా కార్యక్రమాలను చూడడానికి అక్కడి చెట్టు కొమ్మపై కూర్చుని ఉన్న సమయంలో జారి కిందపడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటనలో అతని వెన్నెముక, కాళ్లకు దెబ్బతినడంతో కాకినాడ ఆసుపత్రిలో శస్త్రచికిత్స నిర్వహించారు. ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్న అతనికి ద్రాక్షారామం, తోటపేటకు చెందిన పవన్ కల్యాణ్ అభిమానులు ఈ ఆర్థిక సాయం అందజేశారు.

  • Loading...

More Telugu News