'మనల్నెవరు తీసుకుంటారులే' అనుకునేవాడిని!: హీరో నాని
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'మనల్నెవరు తీసుకుంటారులే' అనుకునేవాడిని!: హీరో నాని

బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే అంటే తనకు ఇష్టమని, ఆమె నటించిన రెండు చిత్రాలు ఇటీవల చూశానని, వాటిలో ఆమె అద్భుతంగా నటించిందని హీరో నాని అన్నాడు. ఒక న్యూస్ ఛానెల్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తనకు ఇష్టమైన హీరో కమల్ హాసన్ అని, ఆయన కూతురు శ్రుతిహాసన్ అంటే కూడా తనకు ఇష్టమని చెప్పాడు. దర్శకుడు చెప్పినట్లు, ఆయన్ని మెప్పించే విధంగా నటించడమే తన సక్సెస్ కు కారణమని అన్నాడు. అసిస్టెంటు డైరెక్టర్ గా తాను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చానని, అయితే, నటుడిని కావాలనే ఆలోచన తనకు ఉన్నప్పటికీ, 'మనల్నెవరు తీసుకుంటారులే' అనుకునేవాడినని నాటి విషయాలను నాని చెప్పాడు.

More Telugu News