: న్యూజిలాండ్ ఫిల్డర్ కు సారీ చెప్పిన పూజారా
టీమిండియా బ్యాట్స్ మన్ ఛటేశ్వర్ పుజారా న్యూజిలాండ్ ఆటగాడు లాంథమ్ కు సారీ చెప్పిన ఆసక్తికర సంఘటన రెండో ఇన్నింగ్స్ లో చోటుచేసుకుంది. రెండో ఇన్నింగ్స్ లో వీలైనన్ని ఎక్కువ పరుగులు సాధించి, డిక్లేర్ చేసి, న్యూజిలాండ్ కు బ్యాటింగ్ అప్పగించాలన్న లక్ష్యంతో టీమిండియా దూకుడు పెంచింది. ఈ క్రమంలో పుజారా, విజయ్ బ్యాటులు ఝుళిపించడం ప్రారంభించారు. దీంతో ప్రతిబంతికీ పరుగు తీయాలనే లక్ష్యంతో ఆడారు. ఈ సందర్భంగా మూడో సెషన్ లో 45.2వ బంతిని సోధీ షార్ట్ బాల్ గా సంధించాడు. దీనిని షార్ట్ లెగ్ దిశగా పూజారా బలంగా కొట్టాడు. దీనిని అక్కడ క్యాచ్ అందుకునేందుకు సిద్ధంగా ఉన్న లాంథమ్ తలకు బంతి బలంగా తాకింది. అతని తలకు హెల్మెట్ లేకుంటే పెను ప్రమాదం సంభవించేదే... అతను తలకు హెల్మెట్ ధరించడంతో ప్రమాదం తప్పింది. దీంతో లాంథమ్ కు పుజారా సారీ చెప్పాడు. దీంతో తనకేమీ కాలేదని, హెల్మెట్ కు బంతి తగిలిందని అన్నాడు. ఈ క్రమంలో పూజారా అర్ధ సెంచరీ పూర్తి చేశాడు.