: శ్రీకాళహస్తిలో సింధు ప్రత్యేక పూజలు
‘రియో’ ఒలింపిక్స్ లో రజత పతకం సాధించిన పీవీ సింధు ఈరోజు శ్రీకాళహస్తి ఆలయాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆమెకు ఘనస్వాగతం పలికారు. అనంతరం, ఆమె రాహు, కేతు పూజలు నిర్వహించింది. పూజలు ముగిసిన తర్వాత తీర్థ ప్రసాదాలు స్వీకరించింది. సింధుతో పాటు బీజేపీ నేత, టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి ఉన్నారు. కాగా, ఈ నెల 4వ తేదీన తన తల్లిదండ్రులతో కలిసి సింధు తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఈ సందర్భంగా శ్రీవెంకటేశ్వరుడికి తులాభారం మొక్కు కింద 68 కిలోల బెల్లంను సింధు సమర్పించుకుంది.