: మామూలుగా మొదలైనా... నాగార్జున వచ్చినప్పటి నుంచి...: 'నిర్మలా కాన్వెంట్'పై చిరంజీవి స్పందన
శ్రీకాంత్ కుమారుడు రోషన్ తొలి సినిమా 'నిర్మలా కాన్వెంట్'ను చూసిన మెగాస్టార్ చిరంజీవి సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. చిత్రాన్ని తిలకించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, "నిర్మలా కాన్వెంట్ అనేది ఓ టెండర్ లవ్ స్టోరీ. స్టార్టింగ్... మామూలుగా స్టార్టయినా, టువర్డ్స్ ఫినిషింగ్, 100 పర్సెంట్ కు వెళ్లిపోయింది. ముఖ్యంగా నాగార్జున ఎంటర్ అయిన దగ్గర నుంచి... పీక్ కు వెళ్లిపోయింది. నేనైతే మాత్రం ఆద్యంత్యం చాలా బాగా ఎంజాయ్ చేశాను" అని చెప్పారు. ఈ సినిమా నేడు థియేటర్లను తాకగా, పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. సినిమా చాలా బాగుందని, ముఖ్యంగా స్క్రీన్ ప్లే అద్భుతమని, రోషన్ మంచి హీరో అవుతాడని నటుడు గోపీచంద్ వ్యాఖ్యానించాడు. చిత్రాన్ని చూసిన హీరోలు నిఖిల్, తరుణ్, అల్లు అరవింద్ తదితరులు ఓ మంచి చిత్రాన్ని చూశామని చెబుతూ, శ్రీకాంత్, ఊహ దంపతులను అభినందించారు.