: 'కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు కనిపించడం లేదంటూ' తిరుపతి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు
కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు కనిపించడం లేదంటూ తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో వామపక్ష నాయకులు ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ నిరసన తెలుపుతున్న వామపక్ష నాయకులు అశోక్‌గజపతిరాజుపై మండిపడ్డారు. కేంద్రం ప్రత్యేక హోదా కాదంటూ ప్యాకేజీ ఇస్తామంటూ చేస్తోన్న ప్రకటనలపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ నేతలు కేంద్ర సర్కారులో ఉన్నప్పటికీ హోదా అంశంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే పోలీస్‌స్టేషన్‌లో వారు కేంద్రమంత్రి కనపడడం లేదని ఫిర్యాదు చేసి వినూత్న రీతిలో నిరసన తెలిపారు.