: కర్ణాటక ప్రజలకు సీఎం సిద్ధరామయ్య సూచన
సుప్రీంకోర్టు కావేరి జలాల అంశంలో ఇచ్చిన తీర్పుతో కర్ణాటక-తమిళనాడు మధ్య ఏర్పడిన ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. బెంగళూరుకు కేంద్రం అదనపు బలగాలను పంపింది. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రజలను ఉద్దేశిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు సంయమనంతో ఉండాలని ఆయన సూచించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. కావేరి జల వివాదంపై కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. మరో 24 గంటల్లో పరిస్థితిని అదుపులోకి తెస్తామని తెలిపారు. మరోవైపు ఇరు రాష్ట్రాలు సంయమనం పాటించాలని కేంద్రం సూచించింది.