: సుజనా చౌదరి... లైడిటెక్టర్ టెస్టుకు సిద్ధమేనా? : రఘువీరా రెడ్డి


కేంద్రమంత్రి, టీడీపీ ఎంపీ సుజనా చౌదరిపై ఏపీసీసీ నేత రఘువీరారెడ్డి మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజ్ బాగుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ తనతో అన్నారని సుజనా చౌదరి చెప్పడం అంతా అబద్ధమని రఘువీరారెడ్డి అన్నారు. ఈ విషయమై లై డిటెక్టర్ టెస్టుకు సుజనా చౌదరి సిద్ధమేనా? అని రఘువీరా ప్రశ్నించారు. కాగా, ఏపీకి ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజ్ చాలా బాగుందని జైరాం రమేశ్ తనతో చెప్పారని ఈరోజు సాయంత్రం మీడియతో సుజనా చౌదరి అన్నారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజ్ తో నయాపైసా కూడా నష్టం జరిగే అవకాశం లేదని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News