: సిగ్గుచేటు... డెంగ్యూ బాధితురాలిపై ఐసీయూలో డాక్టర్, వార్డు బాయ్ అత్యాచారం!
ఎంత కఠినమైన చట్టాలు చేసినా మృగాళ్లు రెచ్చిపోతున్నారు. గుజరాత్ లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో సభ్యసమాజం సిగ్గుతో తలవంచుకునే ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... గాంధీనగర్ లోని ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రిలో డెంగ్యూతో బాధపడుతూ 21 ఏళ్ల యువతి చేరింది. ఆమెను ఐసీయూలో చికిత్స నిమిత్తం ఉంచారు. ఐసీయూ కావడంతో ఆమెతో కుటుంబ సభ్యులు ఉండేందుకు అవకాశం లేకుండా పోయింది. దీనిని అవకాశంగా తీసుకున్న నైట్ షిఫ్ట్ వైద్యుడు రమేష్ చౌహాన్ (28) ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం వార్డు బాయ్ కూడా ఆమెపై అత్యాచారం చేశాడు. కాగా, ఆదివారం ఆమెపై ఈ ఘటన చోటుచేసుకోగా, మోతాదుకు మించిన మందులివ్వడంతో స్పృహ కోల్పోయిన ఆమె, జరిగిన దారుణాన్ని గురువారం గుర్తించింది. తనపై లైంగిక దాడికి ముందు వారిద్దరూ తనకు మత్తుమందు ఇచ్చారని, దీంతో వారితో తాను పోరాడలేకపోయానని ఆమె, తన అంకుల్ కు తెలిపింది. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసి, ఆసుపత్రి యాజమాన్యాన్ని నిలదీయగా, వారు సహకరిస్తామని తెలిపారు. బాధితురాలిపై అత్యాచారం జరిగినట్టు వైద్యపరీక్షల్లో తేలిందని పోలీసులు నిర్ధారించారు.