సింగపూర్ లో భారత చిచ్చరపిడుగు
మరో భారతీయ చిన్నారి విదేశీ గడ్డపై సత్తా చూపాడు. తన ప్రతిభతో భారత సంతతికి చెందిన 12 ఏళ్ల అశ్విన్ కుమార్ సింగపూర్ లో స్పెల్లింగ్ చాంపియన్ షిప్ గెలుచుకున్నాడు. ఫైనల్ రౌండ్ లో 30 మందితో పోటీపడి మరీ నెగ్గాడు. pulchritudinous అనే పదాన్ని సరిగ్గా ఉచ్ఛరించి ఆర్ హెచ్ బీ స్ట్రెయిట్స్ టైమ్స్ నేషనల్ స్పెల్లింగ్ చాంపియన్ గా నిలిచాడు. రెండు లక్షల రూపాయలకు పైగా బహుమానం అశ్విన్ కు లభించింది.