: కర్ణాటకకు ఎదురుదెబ్బ!... తమిళనాడుకు కావేరి నీళ్లివ్వాల్సిందేనని సుప్రీం తీర్పు!
కావేరి జల వివాదంలో కర్ణాటకకు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తమిళనాడుకు కావేరి జలాలివ్వాల్సిందేనని సుప్రీం దర్మాసనం తేల్చిచెప్పింది. కొద్దిసేపటి క్రితం జరిగిన విచారణలో భాగంగా సుప్రీం ధర్మాసనం ఈ మేరకు తీర్పు చెప్పింది. కావేరి జలాల్లో 15 వేల క్యూసెక్కుల నీటిని పది రోజుల పాటు విడతలవారీగా అందజేయాలని కోర్టు తెలిపింది. తమిళనాడుకు కావేరి జలాలను ఇవ్వలేమని వాదించిన కర్ణాటక వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది.. వెరసి కావేరి జలాల కోసం ఇరు రాష్ట్రాల .మధ్య జరుగుతున్న పోరులో కర్ణాటక వాదన తప్పని తేలిపోయింది.