: వీవీఐపీలు నన్ను అపహాస్యం చేశారు.. ఇదే పరిస్థితి మోదీకి ఎదురవుతోంది: మాజీ ప్రధాని దేవెగౌడ


ఒకప్పుడు తనకు ఎదురైన అనుభవమే నేడు ప్రధాని నరేంద్రమోదీకి ఎదురవుతోందని మాజీ ప్రధాని దేవెగౌడ అన్నారు. ప్రస్తుతం దేశ రాజకీయం మొత్తం వీవీఐపీల చుట్టూ తిరుగుతోందని విమర్శించారు. అప్పట్లో ప్రధానిగా తన సాధారణ జీవితాన్ని జీర్ణించుకోలేకపోయిన వీవీఐపీలు తనను అపహాస్యం చేశారన్నారు. వారి చెడు సంస్కృతితో విభేదించిన తాను పలుమార్లు వారి అపహాస్యానికి గురయ్యానన్నారు. ఇప్పుడు ఇదే పరిస్థితి మోదీకి కూడా ఎదురవుతోందన్నారు. మామూలు రైతు కుటుంబం నుంచి వచ్చిన తాను ప్రధాని అయినా సాధారణ జీవితం గడపడాన్ని వీవీఐపీలు జీర్ణించుకోలేకపోయారన్నారు. మోదీ కూడా అదే స్థాయి నుంచి వచ్చి ప్రధాని అయ్యారని పేర్కొన్న దేవెగౌడ ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆయనను హెచ్చరించారు.

  • Loading...

More Telugu News