: వైభవంగా 'మనం' దర్శకుడి వివాహం
'మనం' సినిమాకు దర్శకత్వం వహించిన ప్రముఖ దర్శకుడు విక్రమ్ కుమార్ ఓ ఇంటివాడయ్యాడు. చెన్నైలో విక్రమ్ కుమార్, శ్రీనిధిల వివాహం నేడు వైభవంగా జరిగింది. బంధువులు, స్నేహితులు, తమిళ సినీ ప్రముఖులు సూర్య, ఏఆర్ రెహ్మాన్ తదితరులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. నేటి సాయంత్రం రిసెప్షన్ ఉంటుందని విక్రం సన్నిహితులు తెలిపారు. కాగా, విక్రమ్ కుమార్ ఇటీవల '24' అనే సినిమా తీస్తుండగా శ్రీనిధితో పరిచయం ఏర్పడింది. ఈ సినిమాకు ఆమె సౌండ్ ఇంజనీర్ గా పనిచేశారు. ఈ పరిచయం ప్రేమగా మారి, పరిణయం వరకు వెళ్లింది. దీంతో వివాహంతో వారిద్దరూ ఒక్కటయ్యారు.