Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

లాస్ ఏంజిల్స్ ఎయిర్ పోర్టులో కాల్పులు!

అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో కాల్పులు కలకలం సృష్టించాయి. వెంటనే స్పందించిన భద్రతా దళాలు, ఎయిర్ పోర్టును మూసివేసి ప్రయాణికులను బయటకు పంపించి వేశారు. కాల్పులకు పాల్పడ్డాడన్న అనుమానంతో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అసులు తుపాకితో ఎయిర్ పోర్టులోకి ఎలా ప్రవేశించాడన్న విషయాన్ని కూడా పోలీసులు కూపీ లాగుతున్నారు. ఈ ఘటనలో ఎవరూ మృత్యువాత పడలేదని ప్రాథమిక సమాచారం. ఎయిర్ పోర్టును తమ అధీనంలోకి తీసుకున్న భద్రతా దళాలు అణువణువూ గాలిస్తున్నాయి. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

More Telugu News